Janatha Garage Telugu Movie Teaser

రంజాన్ శుభాకాంక్షలతో గ్యారేజ్ టీజర్..

Janatha Garage Telugu Movie Teaser Jr NTR, Samantha, Mohanlal, Nithya Menen, Koratala Siva



యంగ్‌టైగర్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్టైలిష్ ఎంటర్‌టైనర్ ‘జనతాగ్యారేజ్’. రంజాన్ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంది. తనదైన శైలి డైలాగులతో ఆకట్టుకున్నాడు. ‘‘ బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం అనవాయితీ... బట్ ఫర్ ఏ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. ‘జనతాగ్యారేజ్’ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’’ అనే డైలాగుతో టీజర్ సూపర్బ్‌గా ఉంది. అలాగే ఎన్టీఆర్, మోహన్ లాల్ ముస్లిం వేషధారణలో కనిపిస్తూ రంజాన్ కానుకగా ముస్లిం సోదరులకు ఇద్ ముబారక్ అంటూ విషెస్‌ను తెలియజేశారు. ఈ టీజర్ నందమూరి అభిమానులు, ముస్లిం సోదరులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడ్ని అలరిస్తోంది. ఈ టీజర్‌తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయంటున్నారు సినీజనం. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. సమంత, నిత్యమీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.