బోల్ట్‌కు గాయం..రియోకు దూరం!

బోల్ట్‌కు గాయం..రియోకు దూరం!

Usain Bolt

కింగ్‌స్టన్: జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌కు గాయపడ్డాడు. రియో ఒలింపిక్స్ అర్హత కోసం జరుగుతున్న ట్రయల్స్‌లో బోల్ట్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో జాతీయ ట్రయల్స్ నుంచి అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం గాయానికి మెరుగైన చికిత్స తీసుకుంటున్న బోల్ట్ రానున్న రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగేది ఒకింత అనుమానంగా మారింది. అయితే రియోకు అర్హత సాధించేందుకు ఈనెల 22న జరిగే లండన్ వార్షికోత్సవ క్రీడల రూపంలో బోల్ట్‌కు మరో అవకాశం మిగిలే ఉంది.