ఫ్లోరిడా: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తన టెక్నాలజీనీ కాపీ కొట్టిందంటూ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి కోర్టులో దావా వేశారు. ఫ్లోరిడాకు చెందిన థామస్ రాస్..1992లో తాను రూపొందించిన ఎలక్ట్రానిక్ రీడింగ్ డివైస్ (ఈ ఆర్ డీ) టెక్నాలజీని యాపిల్ కాపీ కొట్టిందంటూ ఆ సంస్థపై సుమారు 68వేల కోట్ల రూపాయల దావా వేశారు. నవలలు, వ్యాసాలు చదువుకోవడానికి, ఫొటోలు బ్రౌజింగ్‌కు, వీడియోలు చూసేందుకు తాను ఈ డివైస్‌ను రూపొందించానని, ఈ డివైస్ పేటెంట్ కోసం 1992లో అమెరికా పేటెంట్, ట్రేడ్ మార్క్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. అయితే, రాస్ దరఖాస్తును ఆ సంస్థ తిరస్కరించిందని సమాచారం. యాపిల్‌పై దావా గెలిస్తే 68వేల కోట్ల రూపాయలతో పాటు ఏడాదికి 23వేల కోట్ల డాలర్లు రాస్‌కు యాపిల్ సంస్థ చెల్లించాల్సి ఉంటుంది.
యాపిల్’పై రూ.68వేల కోట్ల దావా..!