ఇప్పుడు వాట్సాప్‌ వర్సెస్‌ యాపిల్‌





ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌కు యాపిల్‌ ఐవోఎస్‌10కు మధ్య వివాదానికి తెరలేచింది. తమ సాఫ్ట్‌వేర్‌లోని కొన్ని ఫీచర్లను వాట్సాప్‌ అక్రమంగా వినియోగించుకుందని యాపిల్‌ ఆరోపించింది. వాట్సాప్‌ తమ కొత్త ఐమెసేజ్‌ నుంచి కొన్ని ఫీచర్లు కాపీకొట్టినట్లు యాపిల్‌ ఆరోపించింది. ఈ కొత్త ఐమెసేజ్‌ యాప్‌ను సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టనుంది. దీనిని యాపిల్‌ 2016 వరల్డ్‌వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించింది.
ఆ ఫీచర్‌ ఏంటి..? 
త్వరలో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తన మెసెంజర్‌లో ప్రవేశపెట్టనుంది. దీనితో వినియోగదారులు ఫొటోలను ఎడిట్‌ చేసుకోవడంతోపాటు నేరుగా దానిని మెసెంజర్‌ స్క్రీన్‌ నుంచి తీసుకోవచ్చు. ఇటువంటిదే యాపిల్‌ ఐవోఎస్‌10లో కూడా ఉంది. దీనిలో స్కెచ్‌లను, ఫ్లాష్‌ ఫైల్స్‌, హృదయ స్పందనలు వంటివి పంపే అవకాశం ఉంది.