హెడ్ కోచ్‌గా కుంబ్లే మరో పదవికి రవిశాస్త్రి రాజీనామా..!

ravi shastri kumble

ముంబై: టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ పదవి పైన బాగా ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఆ పదవి అనిల్ కుంబ్లేకు దక్కింది. దీంతో రవిశాస్త్రి ఆవేదనకు లోనైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఐసీసీ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయంశమవుతోంది. అయితే, కుంబ్లే ఎంపికకు, తాజా రవిశాస్త్రి రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని ముందుగానే ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌కు చెప్పారని అంటున్నారు.
ఐసీసీలో కుంబ్లే చైర్మన్‌గా ఓ కమిటీ పని చేస్తోంది. సదరు కమిటీలో రవిశాస్త్రి కూడా సభ్యుడిగా ఉన్నారు. మీడియా ప్రతినిధి హోదాలో సదరు కమిటీలో సభ్యుడిగా ఉన్న రవిశాస్త్రి.. ఆ కమిటీ చైర్మన్‌గా ఉన్న కుంబ్లే టీమిండియా కోచ్‌గా ఎంపిక కావడంతో సదరు సభ్యత్వానికి రాజీనామా చేశారు.