ఉంగరాలు మార్చుకున్న దీపికా, రణవీర్..?



బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హాట్ బ్యూటి, దీపిక పదుకొనె. ప్రస్తుతం  ఈ భామకు సంబంధించిన ఓ వార్త సినీ అభిమానులకు షాక్ ఇస్తోంది. చాలా రోజులుగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో సన్నిహితంగా ఉంటున్న దీపికకు ఇప్పుడు నిశ్చితార్థం జరిగిందన్న వార్త నార్త్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటి వరకు తమ ప్రేమ విషయంపై ఎలాంటి కామెంట్ చేయని ఈ జంట.. తాజాగా అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారట. ప్రస్తుతం ఇద్దరి కెరీర్ లు మంచి ఫాంలో ఉండటంతో ఇప్పుడే పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదని భావిస్తున్న ఈ జంట.., నిశ్చితార్ధం విషయాన్ని కూడా రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకుందట. మరి ఈ ఎంగేజ్ మెంట్ వార్తలపై అయినా బాజీరావ్ మస్థానీలు స్పందిస్తారో.. లేదో..?