నా కుమారుల నిర్ణయాల పట్ల సంతోషంగా ఉన్నా..

నా కుమారుల నిర్ణయాల పట్ల సంతోషంగా ఉన్నా: నాగార్జున

Nagarjuna
నాగార్జున
‘కింగ్‌’ నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్‌.. కెరీర్‌కు సంబంధించిన విషయాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. టాప్‌ హీరోయిన్‌ సమంతతో చైతూ, తన చిన్ననాటి స్నేహితురాలితో అఖిల్‌ ప్రేమాయణం సాగిస్తున్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల పట్ల నాగ్‌ స్పందించారు.
 
ఓ ఇంగ్లీష్‌ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘నా కొడుకుల నిర్ణయాల పట్ల సంతృప్తిగా ఉన్నా. ఎవరితో ఉంటే జీవితం సంతోషంగా గడుస్తుందో వారినే వివాహం చేసుకోవాలని చైతూ నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం పట్ల నాతోపాటు అమల కూడా ఆనందంగా ఉంది. ఇక అఖిల్‌ కూడా తన జీవిత భాగస్వామి పట్ల క్లారిటీగా ఉన్నాడు. అయితే అందరూ అనుకుంటున్నట్టు అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌ అయిపోలేదు. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. వారు చెబితేనే బాగుంటుందేమోన’ని నాగ్‌ తెలిపారు. కాగా, చైతూ, అఖిల్‌ ఇద్దరి పెళ్లిళ్లు డిసెంబర్‌లో జరుగనున్నట్టు తెలుస్తోంది.