కొద్దిరోజుల్లో ప్రారంభం కాబోయే ఒలింపిక్స్ కోసం బ్రెజిల్ నిర్వహకులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్టేడియాల ఆధునీకరణతో పాటు.. ప్లేయర్స్ కోసం స్పోర్ట్స్ విలేజ్ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆర్గనైజర్స్ వారిని ఆకర్షించేందుకు దాదాపు 90లక్షల కండోమ్స్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్‌ను అడ్డుకునేందుకు ఈ కండోమ్స్‌ను ప్రత్యేకంగా రూపొందించారు నిర్వహకులు.
ఆగస్టులో ప్రారంభమయ్యే ఒలింపిక్స్‌కు భారీ సంఖ్యలో క్రీడాకారులు, అథ్లెట్లు రావడంతోపాటు వీక్షకులు కూడా పలు దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే, కొద్ది రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముందస్తు భద్రత, సేఫ్టీ సెక్స్‌లో భాగంగా వారికోసం ఈ ఉచిత కండోమ్స్ సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. కానీ అక్కడికి వచ్చే క్రీడాకారులు మాత్రం అసలు ఆటతో పాటు, బెడ్ మీద ఆ ఆట కూడా బాగా ఆడతారట.
అందుకే వాళ్ల కోసం ఇలా కండోమ్‌లను ముందుగా రెడీ చేస్తున్నారట. వీటిన్నింటిని నాటెక్స్ ల్యాబ్ సిద్ధం చేసినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెజాన్ ప్రాంతంలో పెరిగే రబ్బర్ చెట్ల ద్వారా వీటిని తయారు చేసినట్లు పేర్కొన్నారు.
