చాక్‌లెట్ తింటే గుండే జబ్బులు రావటా.. రోజు ఎన్ని తినాలంటే




రోజుకు ఒక చాక్లెట్‌ తింటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్కాట్లాండ్‌లోని అబెర్డీన్ యూనివర్సిటీ పరిశోధకులు దాదాపు 21 వేల మందిపై గడిచిన పన్నెండేళ్ళుగా పరిశోధనలు చేసి చాక్లెట్‌లోని సుగుణాలను తేల్చి చెప్పారు. చాక్లెట్‌ రుచి చూడని వారితో పోలిస్తే అడపా దడపా చాక్లెట్‌ను ఆస్వాదించే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయట. క్రమం తప్ప కుండా రోజూ చాక్లెట్‌ తినేవారికి గుండె జబ్బుల ముప్పు 25 శాతం వరకు తగ్గుతుందనీ, 45 శాతం మేరకు మరణాంతక జబ్బులు తగ్గుతాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. చాక్లెట్‌ గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా లోబ్లడ్‌ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. శరీరానికి అవసరమయ్యే శక్తిని వ్యాధి నిరోధకతను వెంటనే అందించే శక్తి చాక్లెట్‌కు ఉంది. ఇవి చాలావరకూ అన్ని రకాల బ్లడ్‌ప్రజర్స్‌ను రెగ్యులేట్‌ చేస్తాయట. అందువల్ల చాక్లెట్‌ను కూడా రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.