మొదట పోర్న్ తారగా వెలుగొంది, తర్వాత బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ దక్కించుకుంది సన్నీలియోన్. బాలీవుడ్‌లో ఎక్స్ రేటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తనుందట. ఈ విషయాన్ని అమే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
ఇప్పటివరకు తన అందచందాలతో అలరించిన సన్నీ.. ఇక ముందు తన గాత్రంతో మైమరిపించనుంది. అవును.. సింగర్‌గా కొత్త అవతారం ఎత్తనుంది సన్నీ. రికార్డింగ్ స్టూడియోలో అప్పుడే ఓ పాట కూడా పాడేసింది. ఆ ఫోటోను సన్నీ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పెట్టింది. ‘భయాలన్నింటిని వదిలిపెట్టి ముందుకు వెళ్లాను. అనుకున్నట్టుగానే బిగ్గరగా పాడగలిగాను. అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాన’ని కామెంట్ కూడా పెట్టింది. మరి సింగర్‌గా కూడా సన్నీ సక్సెస్ అవుతుందో, లేదో చూడాలి.
