పవర్‌స్టార్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పవన్ అభిమానులను నిరాశపరచడంతో ఇక వరుస సినిమాలతో వేగం పుంజుకుందామనుకున్నాడు కళ్యాణ్ బాబు. ఆ కోవలోనే సర్దార్ విడుదలైన కొన్ని రోజులకే ఎస్.జే.సూర్యతో సినిమా మొదలుపెట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి దర్శకుడు ఎస్.జే.సూర్య తప్పుకోవడం డైరెక్టర్ డాలీని ఎంపిక చేయడం జరిగింది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగి మూడు నెలలు, అలాగే దర్శకుడిని మార్చి మరో నెల కావస్తున్నా ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకపోవడంతో ఈ సినిమా రద్దయ్యే అవకాశం ఉందనే వార్త రెండు రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ గాసిప్స్‌కు చిత్ర నిర్మాత, పవన్ స్నేహితుడు శరత్ మారార్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును పక్కన పెట్టలేదంటూ ఈ సినిమా తెరకెక్కించి తీరుతామని చెప్పారు. పవన్, డాలీ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి అందరూ సిద్ధంగా ఉన్నారనీ, స్ర్కిప్ట్ కూడా రెడీగా ఉందని త్వరలోనే ఫస్ట్‌షెడ్యూల్‌కు వెళ్లనున్నట్లు శరత్ మారార్ చెప్పారు. ‘కడప కింగ్’ అనే టైటిల్‌ను శరత్ మారార్ ఫిలించాంబర్‌లో రిజిస్ట్రర్ చేయించగా..ఆ టైటిల్ ఈ సినిమా కోసమేనని పలువురు సినీజనం చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ ఎంపిక చేయగా..సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.
పవన్ సినిమాపై క్లారిటీ..