బ్రేకింగ్ న్యూస్: కేజ్రీవాల్‌కు సిబిఐ షాక్

కేజ్రీవాల్‌కు
కేజ్రీవాల్‌కు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సిబిఐ షాకిచ్చింది. కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ను అవినీతి ఆరోపణలపై సిబిఐ అరెస్ట్ చేసింది. సిబిఐ గతంలోనే రాజేంద్ర కుమార్ కార్యాలయాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో కేజ్రీవాల్ తీవ్ర నిరసన తెలియజేశారు. కొంత విరామం ఇచ్చాక అన్ని ఆధారాలు సేకరించిన సిబిఐ రాజేంద్ర కుమార్ అరెస్ట్ చేసింది. మరో నలుగురిని కూడా అరెస్ట్ చేసింది. దీంతో కేజ్రీవాల్‌కు చిక్కులు ఎదురుకానున్నాయి. అవినీతికి వ్యతిరేక పోరు అంటూ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాజేంద్ర కుమార్‌ను నియమించుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.