న్యూయార్క్: ఫ్లోరిడాలోని మియామీ ప్రాంతంలోని ఓ ఇంట్లో 24 బకెట్లు దొరికాయి. మామూలుగా బకెట్లు దొరికితే వార్తయ్యే వాషయం కాకపొయ్యేదే కానీ.. ఈ బకెట్లలో 10 మిలియ్ డాలర్ల నుంచి 20 మిలియన్ డాలర్ల మేర(సుమారు రూ. 163కోట్లు) లభించడంతో పెద్ద సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఓ వ్యాపారి అక్రమంగా సంపాదించిన ఆ డబ్బును ఇలా బకెట్లలో దాచుకున్నాడు. అది కూడా అతని ఇంటి అటక మీద దాచిపెట్టాడు. ఆ సొమ్ముతో పాటు అత్యంత ఖరీదైన గన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అ అక్రమార్కున్ని మియామీ పోలీసులు అరెస్టు చేశారు.
లూయిస్ హెర్నాండేజ్ గొంజాలెజ్‌కు మియామిలో గార్డెనింగ్ సామన్లు అమ్మే షాపు ఉంది. అయితే అతనిపై మనీల్యాండరింగ్ కేసు నమోదైంది. అక్రమంగా మాదక ద్రవ్యాలు కూడా అమ్ముతున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ కోసం పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. ఇంటి మీద అటకలోకి ప్రవేశించిన పోలీసులకు అక్కడున్న బకెట్లు షాకిచ్చాయి. మిలియన్ల డాలర్ల డబ్బును ప్యాకెట్ల రూపంలోబకెట్లలో పెట్టి వాటిని అటక మీద గోడలో దాచాడు. డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. లూయిస్‌ను, అతని సోదరి సల్మా గొంజాలేజ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులు ప్రవేశపెట్టారు. కాగా, ఇంత భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు.