స్టార్ రజినీకాంత్ ఓ నటుడిగానే కాక మంచి మానవత్వం ఉన్న మనిషిగా ఎందరో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అభిమానుల దృష్టిలో సూపర్ స్టార్ అయినప్పటికీ తాను మాత్రం సామాన్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు. అయితే ఓ రాష్ట్ర ప్రభుత్వం రజినీ క్రేజ్ ని క్యాష్ చేసుకొని కొన్ని మంచి పనులు చేసేందుకు సరికొత్త స్కెచ్‌లు వేసినట్టు తెలుస్తోంది.
రజినీకాంత్ తాజాగా నటించిన చిత్రం కబాలి. ఈ చిత్రంపై దేశవిదేశాల్లో భారీ క్రేజ్ నెలకొంది. రజినీ అభిమానులు ఈ చిత్రం కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్‌ని మంచి పనులకు వాడుకోవాలనుకున్న పుదుచ్చేరి ప్రభుత్వం అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ టిక్కెట్స్ ఉచితంగా పొందాలంటే .. మీ ఇంట్లో టాయిలెట్స్ నిర్మించుకోండి’ అని ప్రచారం మొదలు పెట్టిందట. ఇటీవల పుదుచ్చేరి ప్రభుత్వం 772 నివాసాల్లో 447 ఇండ్లకు మరుగుదొడ్లు లేవని గుర్తించిందట. ఈ నేపధ్యంలో రజనీ మానియాతో అయిన ఆ పనిని పూర్తి చేయాలని అక్కడి ప్రభుత్వం భావించిందట. సో మొత్తానికి రజినీ క్రేజ్ ఈ స్థాయిలో పెరుగుతుండడంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది.
