కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తున్న సల్మాన్ ఖాన్ సుల్తాన్



సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరికెక్కిన సినిమా సుల్తాన్. సల్మాన్ మల్లయోధుడిగా కనిపించిన ఈ సినిమా మరోసారి సల్మాన్ స్టామినాను ప్రూవ్ చేస్తూ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. కండల వీరుడు ఈ సినిమాతో మరోసారి ఈద్ బరిలో తనకు తిరగులేదని నిరూపించుకున్నాడు.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తున్న సుల్తాన్, సల్మాన్ కెరీర్ లోనే నెంబర్ వన్ గా నిలిచింది. తొలి మూడు రోజుల్లోనే 105 కోట్లకు పైగా వసూళ్లు చేసిన సుల్తాన్, ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి 150 కోట్ల మార్క్ ను రీచ్ అవుతుందని భావిస్తున్నారు. లాంగ్ వీకెండ్ తో పాటు మరో స్టార్ హీరో బరిలో లేకపోవటం కూడా సల్మాన్ కు కలిసొచ్చింది.

సల్మాన్ సరసన అనుష్క శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం అందించారు. తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా భారీ వసూళ్లను సాధిస్తోంది.