కోహ్లీకి కూడా లక్ష్మణ రేఖ గీస్తా - కుంబ్లే

కోహ్లీకి కూడా లక్ష్మణ రేఖ గీస్తా: కుంబ్లే

Anil Kumble
కుంబ్లే

బెంగళూరు: టీం ఇండియా టెస్ట్ కెప్టెన్, ఇండియన్ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి త్వరలో పెద్ద పరీక్ష ఉండనుంది. ఈ నెల 21 నుంచి విండీస్ జట్టుతో జరగనున్న టెస్ట్ టోర్నమెంట్‌కు సిద్దమౌతున్నాడు. అయితే భారత జట్టుకు ఇటీవలే కొత్త కోచ్‌గా ఎంపికైన కుంబ్లేతో కోహ్లీ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఒక పక్క కోహ్లీ దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి, మరోపక్క జట్టును నడిపించే కోచ్ కుంబ్లే మాత్రం ఆలోచించి ఆచి తూచి వ్యవహరించే స్వబావం ఉన్న వ్యక్తి. గతంలో ఆస్ట్రేలియా టూర్ సమయంలో తలెత్తిన మంకీ గేట్ వివాదాన్ని అతను డీల్ చేసిన విధానమే అందుకు నిదర్శనం.
 
అయితే కోహ్లీ గురించి కుంబ్లే మాట్లాడుతూ.. కోహ్లీ దూకుడ్ని తాను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోబోనని, కానీ కోహ్లీకి కూడా లక్ష్మణ రేఖ ఉంటుందని అది తప్పకుండా పాటించాల్సిందేనని చెప్పాడు. దీంతో ఇరువురి కలయిక ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. అయితే ఇటీవల ఆసిస్ మాజీ ప్లేయర్ గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ.. కోహ్లీ దూకుడికి కుంబ్లే అపార అనుభవం తోడైతే మంచి ఫలితాలు వస్తాయని కామెంట్ చేశాడు. మరి వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే..