బంధం బలపడింది..!




2003లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అందాల తార నయనతార... సినీ ఇండస్ట్రీలోని హీరో, కొరియోగ్రాఫర్‌లతో మొదట లవ్ ఎపైర్ నడిపిన నయన్..కొంతకాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని..పెళ్లి చేసుకోబోతున్నారని టాలీవుడ్, కోలీవుడ్‌లో కోడై కూసింది. ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా ఈ హాట్ టాపిక్ జంట రీసెంట్‌గా జరిగిన ‘సైమా’ అవార్డ్స్‌లో ఒక్కటిగా దర్శనమిచ్చారు. అందులోనూ వీరిద్దరూ కౌగిలించుకుని మరీ అవార్డ్ ఫంక్ష‌న్‌లో కనిపించారు. దీంతో నయన్, విఘ్నేష్‌లు త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని పలువురు సినీజనం కన్ఫామ్ చేసుకున్నారు. ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక లవ్ స్టోరీలకి నయనతార పుల్ స్టాప్ పెడుతుందని ఊహించారంతా. కానీ అదేం జరగలేదు. అంతుకుముందు కన్నా ఇంకా ఎక్కువ లవ్ స్టోరీలే వినిపిస్తున్నాయి. యువ హీరో ఆర్య మొదలుకొని పలువురితో ప్రేమ కథలు నడిపిదంటూ ప్రచారాలు జరిగాయి. అందులో విఘ్నేష్ శివన్ కూడా ఉన్నాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నటించిన `నేనూ రౌడీనే` అనే సినిమా నుంచి వాళ్లిద్దరి మధ్య బంధం బలపడింది. నయన్ గత ప్రేమ చరిత్ర తెలిసిన వాళ్లు మాత్రం ఈ బంధం ఎన్నాళ్లోనని చెవులు కొరుక్కుంటున్నారు.