ప్రేయసి వార్తలపై అఖిల్ స్పందన..!

ప్రేయసి వార్తలపై అఖిల్ స్పందన..!


Akhil
అక్కినేని నటవారసుడిగా తెలుగు తెరపై ఆరంగేట్రం చేసిన అఖిల్ పెళ్లి కబురుపై గత రెండురోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రియా భూపాల్ అనే ఫ్యాషన్ డిజైనర్‌ను అఖిల్ పెళ్లాడనున్నట్లు త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందనే టాక్ చిత్రపరిశ్రమలో జోరుగా వినిపిస్తోంది. రీసెంట్‌గా దీనిపై అఖిల్ స్పందించినట్లు తెలిసింది. తనతో పరిచయమున్న మాట నిజమే కానీ.. ఎంగేజ్‌మెంట్ జరగలేదని...అవన్నీ రూమర్స్ అంటూ అఖిల్ ఖండించాడని సమాచారం. కేవలం ఆమెను తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడని తెలిసింది. అమ్మాయి తల్లిదండ్రులు కూడా తమ కూతుర్ని అఖిల్ తన కుటుంబానికి స్వయంగా పరిచయం చేయాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ అని..చాలా కాలం నుంచి తెలుసని చెప్పుకొచ్చాడట. తన తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగే పరిస్థితి కలిగించనంటూనే.. వారు తన విషయంలో సంతోషంగా ఉన్నారన్నాడట. అన్ని కుటుంబాలు తమ కుటుంబాల్లా ఉండవని, అయితే కొన్ని సంప్రదాయాలను పాటించవలసి ఉంటుందని అఖిల్ పేర్కొన్నట్లు తెలిసింది.