న్యూఢిల్లీ : ఇక నుంచి బ్యాంకులు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్ళు వారం రోజులూ, 24 గంటలూ పనిచేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్(రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్) పేరుతో కొత్త చట్టాన్ని బుధవారం ఆమోదించింది. ఈ విధానం వలన ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇటీవల ఒక టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 24/7 విధానం అమలు చేసే సంస్ధలు చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. రాత్రి వేళల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు క్యాబ్ సౌకర్యం కల్పించడం, టాయిలెట్ల ఏర్పాటు, వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూడటం చేయాల్సి ఉంటుంది. అయితే ఫాక్టరీలకు, ప్రింటింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్టాక్స్ అండ్ షేర్స్ బ్రోకరేజ్ తదితర పనులకు, కార్యాలయాలకు చట్టం నుంచి మినహాయింపు ఉంది. వీటితో పాటు 1948 నాటి ఫ్యాక్టరీల చట్టం కిందకు రాని బహిరంగ ఎమ్యూజ్‌మెంట్‌లకు మినహాయింపు ఉంది. దాదాపు 10 అంతకు మించి కార్మికులు పనిచేస్తున్న సంస్ధలు చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టాన్ని అమలు చేయాలా? వద్దా? అనే విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఈ చట్టాన్ని యథాతథంగా అమలు చేయడమా? లేక స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకోవడమా? అనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలి..
ఇక 24 గంటలూ బ్యాంకులు, మాల్స్!