స్మార్ట్ ఫోన్ తో పెళ్లి.. వీడియో
ఆరోన్ ఒక స్మార్ట్ ఫోన్ ని పెళ్ళాడాడు. ఆర్టిస్ట్, డైరెక్టర్ అయిన ఇతగాడు తన భార్యగా ఒక డివైస్ ను ఎంపిక చేసుకున్నాడు. లాస్ ఏంజిలిస్ నుంచి లాస్ వేగాస్ వరకు సుమారు 365 కిలోమీటర్లు ప్రయాణించి మరీ చర్చిలోని వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. అతగాడు స్మార్ట్ ఫోన్ ను పెళ్లాడడమే ఒక వింతగా నిలిస్తే.. ఈ టిపికల్ పెళ్లికి చర్చి అధికారులు కూడా గుర్తింపు ఇవ్వడం అంతకన్నా వింతగా నిలిచింది.
అయితే తనతో చాలా కాలంగా ఈ స్మార్ట్ ఫోన్ ఉందని, తన భావోద్వేగాలను దీనితో పంచుకుంటానని అంటున్నాడు ఆరోన్. అంతేకాదు ఈ పెళ్లి వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాడు.. అటు ఆయన ఈ పెళ్లి ద్వారా సమాజానికి ఒక సందేశాన్నివ్వాలనుకున్నాడని కెల్లి చెప్పడం విశేషం. అయితే ఈ వివాహానికి నెవెడా రాష్ట్ర చట్టబద్ధత లేదని కెటీఎన్ వీ రిపోర్ట్ చేసింది.
లాస్ వెగాస్ : వేదమంత్రాలు.. పంచభూతాల సాక్షిగా జరిగే పెళ్లిళ్లు చూశాం...నిరాడంబరంగా, ఆదర్శంగా జరిగి వివాహాల్ని ఆహ్వానించాం...నీటిలో...నింగిలో ఇలా ఎవరి అభిరుచులకు తగ్గట్టుగా వారు దంపతులయ్యే ముచ్చటను చూశాం..కానీ ఓ వ్యక్తి ఓ వింత పెళ్లి చేసుకున్నాడు. అవును నిజంగా వింతే.. అమెరికాకు చెందిన ఆరోన్ చెర్వెనాక్ అనే ఈ వ్యక్తి చర్చిలో పెళ్లి చేసుకున్నాడు. ఆగండాగండి.. చర్చిలో పెళ్లి వింతేంటి అనుకోవద్దు.. చర్చిలో ఎవరిని పెళ్లాడాడో తెలిస్తే..మీరు షాక్ అవుతారు.
ఆరోన్ ఒక స్మార్ట్ ఫోన్ ని పెళ్ళాడాడు. ఆర్టిస్ట్, డైరెక్టర్ అయిన ఇతగాడు తన భార్యగా ఒక డివైస్ ను ఎంపిక చేసుకున్నాడు. లాస్ ఏంజిలిస్ నుంచి లాస్ వేగాస్ వరకు సుమారు 365 కిలోమీటర్లు ప్రయాణించి మరీ చర్చిలోని వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. అతగాడు స్మార్ట్ ఫోన్ ను పెళ్లాడడమే ఒక వింతగా నిలిస్తే.. ఈ టిపికల్ పెళ్లికి చర్చి అధికారులు కూడా గుర్తింపు ఇవ్వడం అంతకన్నా వింతగా నిలిచింది.
లాస్ వేగాస్ రివ్యూ -జర్నల్ ఈ పెళ్లి వార్తను రిపోర్ట్ చేసింది. వరుడు సూట్ లో మెరిసిపోతే.. వధువు అదే. స్మార్ట్ ఫోన్ ప్రొటెక్టివ్ కేస్ లో ఒదిగిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ ను చట్ట బద్దంగా భార్యగా స్వీకరించడానికి అంగీకరిస్తున్నావా. . విశ్వాసపాత్రంగా ఉంటావా అని అడిగి...ఆరోన్ అనుమతి తీసుకున్న లిటిల్ లాస్ వేగాస్ చాపెల్ యజమాని మైఖేల్ కెల్లీ ఈపెళ్లి తంతును ముగించాడు. (మరి వధువు అనుమతి ఎలా తీసుకున్నారో?)