విక్ర‌మ్‌కు కాబోయే అల్లుడు ఎవ‌రో తెలిస్తే షాకే

విక్ర‌మ్‌కు కాబోయే అల్లుడు ఎవ‌రో తెలిస్తే షాకే

Hero Vikram
త‌మిళ‌నాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత క‌రుణానిధితో స్టార్ హీరో, చియాన్ విక్రమ్ రిలేష‌న్ షిఫ్ ఏంట‌ని షాక్ అవుతున్నారా…మీరు చూసిన ఈ హెడ్డింగ్ నిజ‌మే.. క‌రుణానిధి-విక్ర‌మ్ బంధ‌వుల‌వుతున్నారు. సౌత్‌లో టాప్ హీరోల‌లో ఒక‌రిగా వెలుగొందుతున్న విక్ర‌మ్ త్వ‌ర‌లోనే మామ హోదా పొందుతున్నాడు. విక్ర‌మ్ కూతురు అక్షిత త్వ‌ర‌లోనే పెళ్లి కూతుర‌వుతోంది.
విక్రమ్‌కు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును 50 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఉన్న విక్ర‌మ్‌కు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వీరిద్ద‌రి వ‌య‌స్సు 20 ఏళ్లు పైనే. వీరిలో త‌న కుమార్తెకు విక్ర‌మ్ అప్పుడే పెళ్లి చేసేస్తున్నాడు. ఇంత‌కు విక్ర‌మ్‌కు కాబోయే అల్లుడు ఎవ‌రో కాదు.. అత‌డి పేరు మ‌ను రంజిత్‌. మను రంజిత్ ఎవరో కాదు డీఎంకే నేత కరుణానిధి కొడుకు ముత్తు మనవడు. అక్షిత, మను రంజిత్‌ల వివాహ నిశ్చితార్థాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిర్వహించనున్నారు.
జూలై 10న చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో నిశ్చితార్థం జరగనుంది. 2017లో జరగనున్న వీరి వివాహాన్ని ఘనంగా జరిపించడానికి నటుడు విక్రమ్ సిద్ధం అవుతున్నారు. సో ఈ పెళ్లి త‌ర్వాత క‌రుణానిధి కొడుకు-విక్ర‌మ్ వియ్యంకుల‌వుతున్నారు.