అంతరిక్ష శాస్త్రవేత్తలు కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. భూమికి 340 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కొత్త గ్రహంలో చాలా ఆసక్తిరమైన విశేషాలున్నాయి. దీని బరువు బృహస్పతి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మూడు నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహానికి మూడు సూర్యుళ్లు ఉన్నారంటే నమ్మి తీరాల్సిందే.
అంతేకాకుండా.. ఈ మూడు సూర్యుళ్ల పుణ్యంతో ప్రతినిత్యం సూర్యోదయాలు, మూడు సూర్యాస్తమయాలు ఉంటాయి. కానీ ఈ గ్రహంలో ఒక రోజు అంటే.. మనిషి జీవిత కాలం కంటే ఎక్కువేనని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కొత్తగా కనిపెట్టిన ఈ గ్రహానికి హెచ్‌డీ 131399ఏబీ అనే పేరు పెట్టారు. అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకులు దీన్ని గుర్తించారు.
ఈ గ్రహాన్ని ప్రత్యక్షంగా ఫోటోలు తీయగలిగారు. ఈ గ్రహం మీద ఉష్ణోగ్రత జస్ట్ 580 డిగ్రీలు మాత్రమే. ఒక సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే మరో సూర్యుడు అస్తమిస్తూ ఉంటాట. ఏడాదిలో నాలుగో వంతు వరకూ సూర్యోదయంలోనే ఈ గ్రహం ఉండటంతో.. రాత్రి అనేది ఈ గ్రహంలో లేదనే చెప్పాలి. అంతేకాదు.. ఈ గ్రహం వయస్సు 1.6 కోట్ల సంవత్సరాలకుపైగా వుంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
